తెలంగాణ జల వివాదాలు: కేఆర్ఎంబీ సమావేశం వాయిదా - ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఎత్తిపోతల పథకాల నిర్మాణం మరోసారి హాట్ టాపిక్గా మారింది.
Water


హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఎత్తిపోతల పథకాల నిర్మాణం మరోసారి హాట్ టాపిక్గా మారింది. అక్టోబర్ 1న జరగాల్సిన కీలకమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ ఉండటంతో, సమావేశ తేదీని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అభ్యర్థించింది. దీంతో బోర్డు స్పందించి భేటీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం వెనుక రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులపై నడుస్తున్న ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టుల పనులు ఎలా చేపడతారంటూ ఏపీ ప్రభుత్వం తన లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ తదుపరి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రాజెక్టుల వివాదంపై ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అధికారులు, రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల మధ్య మత, సాంస్కృతిక గుర్తింపులపై ఆయన చేసిన విశ్లేషణ పెద్ద వివాదానికి దారితీసింది. రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande