విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.. మంత్రి పొన్నం
నేడు (మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తంగళ్లపల్లి మండలంలోని కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు.
Minister


రాజన్న సిరిసిల్ల, 29 సెప్టెంబర్ (హి.స.) నేడు (మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తంగళ్లపల్లి మండలంలోని కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు.

తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో మంజూరు చేయించిన పాఠశాలను సందర్శించిన మంత్రి.. విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన వారి చదువులు, యోగక్షేమాలు, పాఠశాలలో అందుతున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొనాలని మంత్రి సూచించారు . విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande