బొల్లారం డిటోనేటర్ల ఘటనపై డీసీపీ క్లారిటీ
హైదరాబాద్ బొల్లారంలో డిటోనేటర్లు లభించిన ఘటనపై మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ కీలక క్లారిటీ ఇచ్చారు. 160 డిటోనేటర్లు ఆర్మీ ప్రాంతంలో దొరకలేదని, అవి ఓ ప్రైవేట్ వెంచర్లో గుర్తించినట్లు స్పష్టం చేశారు.
Detonation


హైదరాబాద్, 03 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ బొల్లారంలో డిటోనేటర్లు లభించిన ఘటనపై మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ కీలక వివరాలు వెల్లడించారు. 160 డిటోనేటర్లు ఆర్మీ ప్రాంతంలో లభించలేదని.. అవి ఓ ప్రైవేట్ వెంచర్లో గుర్తించినట్లు స్పష్టం చేశారు.

ఈ డిటోనేటర్లు ఆర్మీకి చెందిన ఆస్తులు కావని డీసీపీ తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించినట్లు వెల్లడించారు. ఆ డిటోనేటర్లను గతంలో ప్రైవేట్ వెంచర్ డెవలపర్లు అక్కడ ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై అనవసరమైన అపోహలు.. ఆందోళనలు వద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

డిటోనేటర్లు లభించిన వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీసీపీ శ్రీధర్ తెలిపారు. వాటిని అక్కడ ఎవరు ఉపయోగించారు, ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాయి, ఏ అవసరం కోసం వినియోగించారనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande