కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మెదక్ జిల్లాకు అన్యాయం: హరీశ్ రావు
నర్సాపూర్లో నిలిచిపోయిన కాళేశ్వరం కాలువ పనులను మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
Harish Rao


మెదక్, 03 సెప్టెంబర్ (హి.స.)

నర్సాపూర్లో నిలిచిపోయిన కాళేశ్వరం కాలువ పనులను మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాళేశ్వరం కాలువ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని.. రైతులు సాగునీరు లేక అల్లాడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన కాలువ పనులు.. ఇప్పుడు రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో పిచ్చిమొక్కలు మొలిచి దర్శనమిస్తున్నాయన్నారు.

మూడు సంవత్సరాలుగా ఈ కాలువ పనులు ఆగిపోయాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిందో.. అప్పటినుంచి ఈ కాలువ పనులు జరుగడం లేదని రైతులంతా కూడా చెబుతున్నారని హరీశ్ రావు తెలిపారు. ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్ వైపు 17 కిలో మీటర్ల టన్నెల్.. ఆ తర్వాత ఇక్కడి నుంచి కాలువలు తవ్వి నర్సాపూర్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గానికి సాగునీరందించడం కోసం 18, 19 ప్యాకేజీలను చిన్న లిఫ్ట్లో సింగూరు కూడా నీళ్లు నింపుకునే అవకాశానికి.. గోదావరి నీళ్లతో నీళ్లు నింపుకునే ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లుగా ఎక్కడికక్కడ కాళేశ్వరం పనులు నిలిచిపోయినయన్నారు.

గజం కాలువ కూడా ఈ జిల్లాలో తవ్వడం లేదు. రేవంత్రెడ్డి మొన్నప్పుడో జహీరాబాద్కు వచ్చిండు.. కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనని ఫైర్ అయ్యారు హరీశ్ రావు.

5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి, పటాన్ చెరు.. 5నియోజకవర్గాల్లో దాదాపు 4-5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిపేశారన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్క అంగుళం కూడా పనులు జరుగడం లేదన్నారు. ఘనపురం ఆనకట్టు ఎత్తు పెంచాలని ఆనాడు కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. దాదాపు సగానికిపైగా పనులు జరిగినయి. మరి ఆ ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచే పనిని ఎందుకు ఆపేశారని అడిగారు. అది పూర్తయితే ఇటు నర్సాపూర్ నియోజకవర్గానికి, ఇటు మెదక్ నియోజకవర్గానికి ఉపయోగపడే ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ ఆపేసి ఇటు నర్సాపూర్, అటు మెదక్ నియోజకవర్గం ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande