
హైదరాబాద్, 03 సెప్టెంబర్ (హి.స.) మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ప్రస్తుతం హాట్టాపిక్గా మారిందన్నారు.
ఈ వ్యవహారం ఢిల్లీకి చేరినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొందని తెలిపారు. ఈరోజు(గురువారం) జరగనున్న ప్రెస్మీట్పై అందరి దృష్టి నెలకొందన్నారు. మంత్రి కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ అధిష్ఠానం ఏదైనా చర్య తీసుకుంటుందా? లేక ఈ వివాదాన్ని అంతర్గతంగా పరిష్కరించుకుంటారా? అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్