
హైదరాబాద్, 03 సెప్టెంబర్ (హి.స.) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్ వేటు పడిన డీఎస్పీ భీమ్రెడ్డికి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది.
అతడిపై ఈసీఐఆర్ కేసును ఈడీ నమోదు చేసింది. పీఎంఎల్ఏ కింద దర్యాప్తు చేపట్టింది. అతడికి రూ.150 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో భీమ్రెడ్డి ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. అక్రమాస్తుల కేసులో అతడిపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసు ఆధారంగా చేసుకుని ఈడీ విచారణ చేపట్టనుంది.
భీమ్రెడ్డిపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో రూ.2.4 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు కనుగొన్నారు. కానీ సోదాల్లో మాత్రం రూ.150 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో భీమ్రెడ్డి పెట్టుబడులపై ఐటీ శాఖలోని బినామీ విభాగం కూడా విచారణ చేపట్టింది. ఈడీ దర్యాప్తు నేపథ్యంలో భీమ్ రెడ్డి ఈడీ కేసు మరింత ఉత్కంఠగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్