
మయామి-డేడ్ కౌంటీ , 07 సెప్టెంబర్ (హి.స.) పోర్టో రికోలోని శాన్ జువాన్ నుంచి బయలుదేరిన అమెజాన్ ఎయిర్ బోయింగ్ 767-300 కార్గో విమానం ఘోర ప్రమాదానికి గురైంది. మయామి అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే దాటి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అక్కడున్న కొన్ని వాహనాలనూ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలార్పింది. ఈ ఘటనతో విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఏడాదిలో అత్యంత రద్దీగా ఉండే లేబర్ డే వీకెండ్ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంపై స్పందించిన మేయర్
ఈ ఘటనపై మయామి-డేడ్ కౌంటీ మేయర్ డానియెల్ లెవిన్ కేవా మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సెకన్ల వ్యవధిలోనే రెస్క్యూ టీమ్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం మా దృష్టి బాధితుల కుటుంబాలు, గాయపడిన వ్యక్తులు, సహాయక చర్యలపైనే ఉంది అని పేర్కొన్నారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో గాయపడిన ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని మయామి ఫైర్ చీఫ్ రాయిడ్ జాదల్లా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV