కాణిపాకం బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ను ఆహ్వానం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను ఆహ్వానించిన ఆలయ ఈవో, కమిటీ ఛైర్మన్.
chittoor-collector-invited-to-kanipakam-vinayaka-brahmotsavam


కాణిపాకం, 07 సెప్టెంబర్ (హి.స.) కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను ఆలయ కమిటీ ఆహ్వానించింది.

ఈ రోజు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉన్న కలెక్టర్ ఛాంబర్లో ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు (మణి నాయుడు), ఆలయ ఈవో పెంచల కిషోర్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కలెక్టర్ను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆలయ పండితులు కలెక్టర్కు వేదాశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande