
తిరుపతి, 07 సెప్టెంబర్ (హి.స.) , నెల్లూరు జిల్లాల్లో ఒకరోజు పర్యటన నిమిత్తం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
శ్రీకాళహస్తి ఆర్డీఓ బానుప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు యోగి ఆదిత్యనాథ్కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన హెలికాప్టర్లో నెల్లూరు జిల్లా వెంకటాచలానికి బయలుదేరి వెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV