
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు,
నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నించే గొంతులని నొక్కివేసేందుకు అక్రమ కేసులు పెట్టి.. అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా, కర్కశంగా గౌరవ శాసన సభ్యులను, మండలి సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించిన పోలీసులే నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గౌరవ మండలి సభ్యులు తాత మధు, నవీన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. హైకోర్టు చెప్పినా లెక్కచేయకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అంటే చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు