నారాయణగూడ పీఎస్ వద్ద హైటెన్షన్
స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అసభ్య పదజాలంతో దూషించిన క్రమంలో.. వారిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నారు.
Police


హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.) స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అసభ్య పదజాలంతో దూషించిన క్రమంలో.. వారిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరినీ నారాయణగూడ పీఎస్ కు తరలించి.. స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున పీఎస్ కు చేరుకున్నారు. తాతా మధు, నవీన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పీఎస్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. తోపులాట జరిగింది. దీంతో పలువురు కార్యకర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. పీఎస్ వద్ద హైటెన్షన్ పరిస్థితి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande