సభలో లేని వారినీ సస్పెండ్ చేయడం హాస్యాస్పదం: తలసాని శ్రీనివాస్
ప్రజల సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవటానికి తమను సస్పెండ్ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
Talasani Srinivas Yadav


హైదరాబాద్, 09 సెప్టెంబర్ (హి.స.) ప్రజల సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవటానికి తమను సస్పెండ్ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

ఈరోజు(బుధవారం) మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ.. తమకు భయపడి బలవంతంగా బయటకు పంపారన్నారు. శాసనసభవ్యవహారాల మంత్రి చదివిన పేర్లు కాకుండా.. స్పీకర్ వేరే పేర్లు చదివారని తెలిపారు.

సభలో లేని పద్మారావు, మల్లారెడ్డి, గంగుల, గూడెం మహిపాల్ రెడ్డిని సస్పెండ్ చేయటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటే అందరకీ గౌరవమని తలసాని అన్నారు. దళిత స్పీకర్ దళిత స్పీకర్ అంటూ.. ఆయన ఇమేజ్ను కాంగ్రెస్ డ్యామేజ్ చేసిందని విమర్శించారు. భట్టి ముఖ్యమంత్రి అయితే సంతోష పడేది తామే అని చెప్పుకొచ్చారు.

ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ ఏమైందో భట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై బీఆర్ఎస్ చిత్తశుద్ధిని శంఖించాల్సిన అవసరం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande