విడుదలకు ‘కాంతారా చాప్టర్-1’ సిద్ధం.. టికెట్ ధరలు పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)హీరో రిషబ్‌శెట్టి (Rishabh Shetty) నటించి దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్‌-1’ (Kantara Chapter-1) ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 2న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ టికెట్‌ ధరలను పెంచుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Go
‘కాంతారా చాప్టర్-1


అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)హీరో రిషబ్‌శెట్టి (Rishabh Shetty) నటించి దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్‌-1’ (Kantara Chapter-1) ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 2న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ టికెట్‌ ధరలను పెంచుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఒకరోజు ముందు ప్రీమియర్‌ ప్రదర్శనకు అవకాశం కల్పించింది. సినిమా విడుదలైన రోజు నుంచి అక్టోబరు 11 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచుకునేందుకు, బుధవారం రాత్రి 10 గంటలకు ప్రీమియర్‌ షోలు ప్రదర్శించేందుకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande