పవన్ కల్యాణ్ 'OG' సినిమా ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అవుతుంది : వైసీపీ ముఖ్య నేత సంచలన వీడియో
అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.)ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా మరో రెండ్రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించగా.. తమన్ సంగీతాన్ని అందించారు.
pawan-kalyans-og-movie-will-be-a-bigger-hit-than-anyone-expected-ysrcp-le


అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.)ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా మరో రెండ్రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించగా.. తమన్ సంగీతాన్ని అందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. ట్రైలర్లో సస్పెన్స్ బాగా చూపించారని, సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నామని అభిమానులు నెట్టింట పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. OG సినిమా పవన్ కల్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాపై వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసే ఆయన.. తనకు ఉన్న సినీ పరిజ్ఞానంతో OG సినిమా హిట్టవుతుందని భావిస్తున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. బ్రో, హరిహర వీరమల్లు అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాయని, హరిహర వీరమల్లుకు హడావిడి చేసి.. ఆఖరికి సినిమా రిలీజైతే చాలన్న స్టేజ్ కు తీసుకొచ్చారని అన్నారు. సినిమా ఆఖర్లో క్లైమాక్స్ కూడా సరిగ్గా తీయలేకపోయారన్నారు. ఆ కసితో ఈ సినిమా హిట్ అవ్వాలని పవన్ పట్టుదలతో నటించి ఉంటారని పేర్కొన్నారు. పైగా దర్శకుడు సుజీత్ కూడా ఈ సినిమాను అన్ని జాగ్రత్తలతో తెరకెక్కించి ఉంటారని, అందుకే OG సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అందుకుంటుందని చెప్పారు. OG సినిమా హిట్ అవ్వాలని కూడా తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానులను ఆశ్చర్య పరిచాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande