చలికాలంలో రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే.. ఎన్ని లభాలో తెలుసా..?
ఢిల్లీ, 11 అక్టోబర్ (హి.స.)క్యారెట్‌ దీనిని కూరగాయ, స్నాక్‌ ఐటమ్‌, జ్యూస్‌లగా కూడా తీసుకోవచ్చు. ఎలా తిన్నాకూడా క్యారెట్ అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా క్యారెట్‌ జ్యూస్‌లా తీసుకోవటం వల్ల రెట్టింపు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతు
చలికాలంలో రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే.. ఎన్ని లభాలో తెలుసా..?


ఢిల్లీ, 11 అక్టోబర్ (హి.స.)క్యారెట్‌ దీనిని కూరగాయ, స్నాక్‌ ఐటమ్‌, జ్యూస్‌లగా కూడా తీసుకోవచ్చు. ఎలా తిన్నాకూడా క్యారెట్ అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా క్యారెట్‌ జ్యూస్‌లా తీసుకోవటం వల్ల రెట్టింపు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా క్యారెట్ జ్యూస్‌లో బీటా-కెరోటిన్ అనే పదార్ధం సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది. క్యారెట్ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే కలిగే అద్భుతమైన లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

వచ్చేది చలికాలం.. ఈ సీజనల్‌లో మార్కెట్‌ నిండా చాలా రకాల కూరగాయలు కనిపిస్తుంటాయి. అందులో క్యారెట్‌ ఒకటి. క్యారెట్‌లో ఎ, సి, కె, బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో క్యారెట్‌ జ్యూస్‌గా చేసుకుని తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు.​ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారు క్యారెట్ జ్యూస్‌లో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్, టమాటా జ్యూస్‌, చీనీపండ్ల జ్యూస్‌ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడతలు మాయమవుతాయి.

శీతాకాలంలో హెల్తీ, టేస్టీ.. కూరగాయలు, పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయ్‌. వాటిలో క్యారెట్‌ ఒకటి. క్యారెట్‌ టేస్టీగా ఉండటమే కాదు.. దీనిలో పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్‌లో ఎ, సి, కె, బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియంలు ఉన్నాయి. కూల్‌.. కూల్‌ క్లైమెట్‌లో హాట్‌ హాట్‌ క్యారెట్‌ హల్వా తినడం అంటే.. చాలామందికి ఇష్టం. అంతేకాదు, క్యారెట్‌తో సలాడ్స్‌, సూప్‌లు, టెస్టీ కర్రీలు కూడా చేసుకోవచ్చు. చలికాలంలో క్యారెట్‌ జ్యూస్‌గా చేసుకుని తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు.​

నిద్రలేమితో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ జ్యూస్‌ తీసుకోవటం వల్ల మీరు ఊహించని ఫలితం వుంటుంది. క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్‌ తీసుకుంటూ ఉంటే.. ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం, మలబద్దకం దూరమవుతాయి. క్యారెట్‌ను ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత కప్పు రసంలో చెంచా తేనెను కలిపి సేవిస్తే గుండెల్లో మంట మటుమాయం అవుతుంది. క్యారెట్ జ్యూస్‌ మహిళలల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande