వెస్ట్ బెంగాల్, 11 అక్టోబర్ (హి.స.)
పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఏడాది క్రితం జరిగిన హత్యాచార ఘటన ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంది. ఆ తర్వాత మరో లా స్టూడెంట్ పై కూడా అత్యాచారం జరగడంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగాయి. తాజాగా మరో మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన 23 ఏళ్ల యువతి.. బెంగాల్ లోని దుర్గాపుర్ లో శోభాపుర్ సమీపంలోనున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోంది. శుక్రవారం రాత్రి డిన్నర్ చేసేందుకు ఫ్రెండ్ తో కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లింది. వీరిని కొందరు దుండగులు వెంబడించగా... స్నేహితుడు పరారయ్యాడు. బాధితురాలిని బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి.. ఒకడు అత్యాచారానికి ఒడిగట్టారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు