body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
జైపుర్/ఢిల్లీ,,11 అక్టోబర్ (హి.స.): వలపు వలలో పడి రాజస్థాన్‌కు చెందిన మంగత్ సింగ్ అనే వ్యక్తి పాక్ మహిళకు భారత రక్షణశాఖ రహస్యాలను చేరవేశాడు. చివరికి రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కి జైలుపాలయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ శుక్రవారం అల్వార్‌కు చెందిన మంగత్ సింగ్‌ని అరెస్టు (Arrested For Spying) చేసింది.
రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో పాక్‌కు చెందిన ఇషాశర్మతో మంగత్ సింగ్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె కోసం సైన్యం, రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించి తెలియజేసేవాడు. అల్వార్ కంటోన్మెంట్ ఏరియా, ఇతర రక్షణరంగ వ్యూహాత్మక కేంద్రాలపై పాక్‌కు అతడు సమాచారం ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై సెంట్రల్ ఎంక్వైరీసెంటర్‌లో వివిధ నిఘాసంస్థలు విచారణ జరుపుతున్నాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు