body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,11 అక్టోబర్ (హి.స.)దేశ వ్యాప్తంగా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని వెనుక బడిన జిల్లాలో వ్యవసాయ స్థిరీకరణ చేసేందుకు, రైతులకు అండగా ఉండేదుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ధన్ ధాన్య యోజన(PM Dhan Dhanya Yojana) అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీంను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టి్ట్యూట్‌లో జరుగనున్న సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. వ్యవసాయం చేసేందుకు రైతుల కాన్ఫిడెన్స్ పెంచడమే కాకుండా.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు రైతులతో వర్చువల్‌గా మాట్లాడతారు.
వ్యవసాయాన్ని డెవలప్ మెంట్ చేయడం మాత్రమే కాకుండా రైతుల ఆదాయం పెంచడంకోసం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అంతే కాకుండా రైతులకు శిక్షణా కార్యక్రమాలను చేపట్టనున్నారు. తొలిదశలో ఈ పథకాన్ని ఉత్పాదక ఉన్న 100 వ్యవసాయక జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయనున్నారు. తొలుత తెలంగాణలోని జనగామ, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్లో అమలు చేయనున్నారు. అదే విధంగా ఏపీలోని అల్లూరి, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ (Aatmanirbhar Bharat) లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించనున్న ఈ పథకం అమలు, పర్యవేక్షణ కోసం ఇప్పటికే కొంతమంది అధికారులను ఎంపిక చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ