body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ముంబై,11.,అక్టోబర్ (హి.స.)రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) రూ.17వేల కోట్ల మేర రుణాల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. అనిల్ సన్నిహితుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
రిలయన్స్ పవర్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా అశోక్ కుమార్ ఉన్నారు. రూ.68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించి ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి దిల్లీ కార్యాలయంలో అశోక్‌ను ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.17వేల కోట్ల బ్యాంకు మోసం కేసులో రిలయన్స్ పవర్ సహా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ