భారత్‌పై పాకిస్తాన్ ఏడుపు.. ఆఫ్ఘనిస్తాన్‌ను మాపై వాడుతున్నారని ఆరోపణ..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-fa
Pakistan PM


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,,11 అక్టోబర్ (హి.స.)ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన ఎయిర్ స్ట్రైక్స్, పాక్ ఆర్మీపై తాలిబాన్ల దాడులు, భారత్‌లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాఖీ పర్యటన పాకిస్తాన్‌లో తీవ్ర భయాలను పెంచుతున్నట్లు స్పష్టం తెలుస్తోంది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్‌ను ‘‘ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరం’’గా, పాకిస్తాన్‌ను వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది.

పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ (DG) లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పెషావర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో జరుగుతున్న భయంకరమైన దాడుల్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారతదేశ పర్యటనలో ఉన్న సమయంలో పాకిస్తాన్ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి.

2021లో అమెరికన్ దళాలు వదిలిపెట్టిన ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు ఆయుధాలు అందాయని, ఈ సంక్షోభానికి ఇది కూడా కారణమని చౌదరి చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande