మరో ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ముంబై:,,11 అక్టోబర్ (హి.స.)విమానాల్లో వరుస సమస్యలు ఎయిర్‌ ఇండియ
AIR INDIA


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ముంబై:,,11 అక్టోబర్ (హి.స.)విమానాల్లో వరుస సమస్యలు ఎయిర్‌ ఇండియాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా గురువారం ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787 రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో దుబాయ్‌లో సురక్షితంగా దించినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ పైలట్స్‌ (ఎఫ్‌పీఐ) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానం కూడా బోయింగ్‌ 787 రకానికి చెందినదే. ఈ నెల 4న బర్మింగ్‌హామ్‌ వెళ్తుండగా ఇదే రకం విమానంలో ఉన్నట్లుండి అత్యవసర ర్యాట్‌ తెరుచుకుంది. తాజాగా అదే రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎయిర్‌ ఇండియా పేర్కొంది. అయితే, ఆ సమస్యలు ఏమిటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ, ఎఫ్‌ఐపీ మాత్రం ఆ విమానంలో ఆటోపైలట్, ఇన్‌స్ట్రుమెంట్‌ లాండింగ్‌ సిస్టమ్స్‌ (ఐఎల్‌ఎస్‌), ఫైట్‌ డైరెక్టరేట్స్‌ (ఎఫ్‌డీస్‌) ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌ వంటి కీలక వ్యవస్థలన్నీ చెడిపోయాయని ఆరోపించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande