body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,11 అక్టోబర్ (హి.స.)ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించారు. కేవలం 48 గంటల్లో ఉత్తరప్రదేశ్ అంతటా నేరస్థులను ఎన్‌కౌంటర్ చేశారు. ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కింద ఈ చర్య జరిగింది. నేరాలను తగ్గించడానికి, నేరస్థులను కఠినంగా శిక్షించడానికి ఈ ఆపరేషన్‌లు ప్రారంభించారు. మీరట్ నుంచి ముజఫర్‌నగర్ వరకు, పోలీసులు నేరస్థులను కాళ్ళపై కాల్చడం లేదా ఎన్‌కౌంటర్‌లో చంపేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కొనసాగుతున్నాయి. ఆపరేషన్ లాంగ్డా అంటే ఒక నేరస్థుడిని కాలిపై కాల్చి.. ఆపై అరెస్టు చేయడం. ఆపరేషన్ ఖల్లాస్ అంటే పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన నేరస్థుడికి ఎన్‌కౌంటర్ ద్వారా ఏకంగా యమరాజు వద్దకు పంపడం. నేరానికి ఏకైక శిక్ష ఎన్‌కౌంటర్ అని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఆపరేషన్‌లలో భాగంగా కేవలం 48 గంటల్లో, యూపీ పోలీసులు దాదాపు 20 ఎన్‌కౌంటర్‌లను నిర్వహించారు. ప్రతి నగరంలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. మీరట్, ముజఫర్‌నగర్, ఫరూఖాబాద్, ఫిరోజాబాద్, మొరాదాబాద్, మధుర, హర్దోయ్, ఉన్నావ్, ఝాన్సీ, బులంద్‌షహర్, బాగ్‌పత్, బల్లియా, లక్నో, ఘజియాబాద్, షామ్లీ వంటి ప్రాంతాల్లో నేరస్థుల ఏరివేతలు జరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు