body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ముంబై,11.,అక్టోబర్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) చైనాపై సుంకాల బాంబు పేల్చారు. బీజింగ్ దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి (US Stock Markets). శుక్రవారం ఒక్కరోజే అమెరికా మార్కెట్లలో 1.5 ట్రిలియన్ డాలర్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. మార్కెట్లు ముగిసే సమయానికి నాస్‌డాక్ 3.56 శాతం, డోజోన్స్ 1.90శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 2.71శాతం మేర నష్టపోయాయి.
అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా (USA-China) ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్ భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటలకే ట్రంప్ సుంకాల ప్రకటన చేయడం గమనార్హం. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం నడుస్తుందనే భయాలు నెలకొన్నాయి. దాంతో అమెరికా మదుపర్ల సంపద 1.5 ట్రిలియన్ డాలర్ల మేర ఆవిరవగా.. క్రిప్టో మార్కెట్‌లో 19 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు.
చైనా తయారీ వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతి అయినా.. చైనా ఏ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసినా ఈ సుంకం వర్తిస్తుంది. నవంబర్ ఒకటి లేదా అంతకంటే ముందే ఈ టారిఫ్‌లు (US Tariffs) అమల్లోకి రానున్నాయని ట్రంప్ హెచ్చరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ