body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,11 అక్టోబర్ (హి.స.)అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఖీ దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంపై విమర్శలు వస్తున్నాయి. ఆ సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు (Male-Only Press Meet). ఆమిర్‌ఖాన్ సమావేశంలో మహిళా జర్నలిస్టులు కనిపించలేదంటూ వస్తోన్న కథనాలపై కేంద్రప్రభుత్వం స్పందించింది. ఆ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసింది.
శుక్రవారం దిల్లీలోని అఫ్గానిస్థాన్ ఎంబసీలో ముత్తాఖీ మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఒక్క మహిళ కూడా కనిపించలేదు. మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ కొందరు మహిళా పాత్రికేయులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు