body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,11 అక్టోబర్ (హి.స.)వెనెజువెలాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు అక్కడి ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాదో (Maria Corina Machado)కు నోబెల్ శాంతి పురస్కారం (Nobel Peace Prize) లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. మరియా కొరీనా తమ దేశంలో రాజ్యాంగ హక్కుల కోసం పోరాడినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ఇచ్చారని.. అదేవిధంగా ప్రస్తుతం భారత్‌లో విపక్ష నేత రాహుల్ గాంధీ (Opposition leader Rahul Gandhi) కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆయనకు కూడా నోబెల్ శాంతి బహుమతి రావాలని పరోక్షంగా ఆకాంక్షిస్తూ.. వారిద్దరి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ