అమరావతి, 11 అక్టోబర్ (హి.స.) హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఎదురుచూపులు ముగిశాయి. తన తదుపరి చిత్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ నటి కీర్తి సురేష్ దాదాపు ఖరారయ్యారు. హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి కీర్తి సురేష్ హాజరు కావడంతో ఈ వార్తకు బలం చేకూరింది. ఈవెంట్ నుంచి బయటకు వచ్చిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంతో కూడిన పక్కా గ్రామీణ, మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదల చేసిన కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. అనే క్యాప్షన్‌తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
‘
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV