అమరావతి, 12 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలల విషయంలో పీపీపీ విధానమే మేలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలలు అసంపూర్తిగా ఉండిపోయాయన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో పూర్తిస్తాయి భవనాలు, పరికరాల కొనుగోలుకు ఒక్కోదానికి రూ.500 కోట్లు అవసరం అన్నారు. జగన్ తన ఉనికి కోసమే వైద్య కళాశాలల నిర్మాణాల పరిశీలన బాట పట్టారన్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై జగన్ ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ