హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
టాలీవుడ్ స్టార్ నిర్మాత బన్నీ వాసు
మరోసారి వార్తల్లో నిలిచారు. మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు కదా ? అంటూ టికెటింగ్ సంస్థ బుక్ మై షోపై సీరియస్ అయ్యారు. బుక్ మై షో యాప్, సైట్ లో సినిమాలకు అసలు రేటింగ్స్ ఎందుకని నిలదీశారు. జర్నలిస్టులు నిర్ణయాత్మక రివ్యూ ఇస్తున్నారు కదా ? అలాంటప్పుడు మీ యాప్ లో రేటింగ్స్ ఇస్తే ఏంటి లాభం అని ప్రశ్నించారు. దానివల్ల సినిమా నిర్మాత నష్టపోతాడని పరోక్షంగా వెల్లడించారు.
అసలు సినిమా టికెట్ కొనే సమయంలో ఈ మూవీ బాగుంది, ఇది బాగాలేదు అని రేటింగ్ ఇవ్వడం చాలా తప్పు అంటూ ఫైర్ అయ్యారు. మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు కదా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో బన్నీ వాసు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు