ముంబై, 16 అక్టోబర్ (హి.స.) బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా పసిడికి పెరిగిన డిమాండ్, భారత్‌లో పండుగ సీజన్ వెరసి బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందన్న అంచనాలు, చైనాతో కొనసాగుతున్న ఆర్థిక ప్రతిష్టంభన కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంపై పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్స్ పసిడి ధర 4,200 డాలర్ల వద్ద తచ్చాడుతోంది (Gold, Silver Rates on Oct, 16, 2025).
భారత్‌లోనూ ధన్‌తేరస్, దీపావళి పండుగల కారణంగా గత కొద్ది రోజులుగా ధరల్లో ర్యాలీ కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడూ పసిడి, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,660కు ఎగబాకగా, 18 క్యారెట్ పసిడి కూడా 97,090కు పెరిగింది. వెండి కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,90,100గా ఉంది. అయితే, 10 గ్రాముల ప్లాటినం ధర మాత్రం స్వల్పంగా తగ్గి రూ.46,810గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే,18కే) ఇవీ
చెన్నై: ₹1,29,390; ₹1,18,610; ₹97,010
ముంబై: ₹1,29,450; ₹1,18,660; ₹97,090
ఢిల్లీ: ₹1,29,600; ₹1,18,810; ₹97,240
హైదరాబాద్: ₹1,29,450; ₹1,18,660; ₹97,090
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV