ముంబై, 14 అక్టోబర్ (హి.స.)ధంతేరాస్‌కు ముందు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పండుగకు ముందు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న ఒక్క రోజు భారీగా పెరిగింది. 2 వేల రూపాయలకుపైగా ఎగబాకింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి.తాజాగా అక్టోబర్ 14వ దేశంలో బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 వద్ద ఉంది. ఇక వెండి విషయానికోస్తే కిలో వెండి ధర రూ.1.85,100 ఉండగా, హైదరాబాద్‌లో అయితే కిలో వెండి రెండు లక్షలకు చేరువలో ఉంది. అంటే రూ.1,97,100 వద్ద ఉంది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,110 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV