మహేష్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడే.. హాలీవుడ్ రేంజ్‏లో ప్లాన్..
అమరావతి, 19 అక్టోబర్ (హి.స.)సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన్న రూపొందిస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ నెలకొంది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో నిర
్


అమరావతి, 19 అక్టోబర్ (హి.స.)సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన్న రూపొందిస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ నెలకొంది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మిస్తున్న ఈమూవీ షూటింగ్ కొన్ని నెలలుగా విదేశాల్లో జరుగుతుంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రాతోపాటు మరికొంతమంది బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాను ఆఫ్రికా అడువుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 120 దేశాల్లో ఈ మూవీని ఒకేసారి రిలీజ్ చేయడంతోపాటు ఏకంగా రూ.10 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఈ మూవీకి ముందు నుంచి హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందిస్తున్నారని.. భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలవనుందనే టాక్.

ఈ సినిమాలో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు మాధవన్ కీలకపాత్రలు పోషిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు కెరీర్ లోనే ఓ మైలు రాయిగా ఈ సినిమా నిలిచిపోవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే పలు లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా.. ఇటీవల ఆఫ్రికా అడవుల్లో.. దక్షిణ అమెరికా, అమెరికా బేసిన్, ఐస్ లాండ్ వంటి విభిన్న ప్రదేశాల్లో షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను నవంబర్ 16న రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట.ఆ అప్డేట్ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ స్థాయిలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని.. ఆ వేడుకకు హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామరూన్ సైతం హజరు అయ్యే ఛాన్స్ ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.దీంతో ఈ సినిమాకు విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు జక్కన్న.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande