
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.) మెల్బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఆస్ట్రేలియా జట్టులో ఒక మార్పు జరిగింది. జోష్ ఫిలిప్ స్థానంలో మాట్ షార్టు తీసుకున్నారు. అయితే ఫస్ట్ టీ20లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతున్నది. సూర్యకుమార్ నేతృత్వంలోని భారత బృందం ఎటువంటి మార్పులు చేయలేదు. క్యాన్బెరాలో జరిగిన తొలి టీ20 వర్షార్పణమైన విషయం తెలిసిందే. ఆసీస్, భారత్ మధ్య మొత్తం అయిదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..