
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026
టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 15వ తేదీలోపు వేలంలో వదిలేసే ప్లేయర్ల లిస్టును తయారు చేయాలని బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ పనిలో పడ్డాయి ఫ్రాంచైజీలు. ఈ లిస్టులో కేకేఆర్ జట్టు చాలా ఫాస్ట్ గా ఉన్నట్లు సమాచారం. గత సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయిన కేకేఆర్, వచ్చే సీజన్ లో కచ్చితంగా టైటిల్ గెలవాలన్న కసితో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అభిషేక్ నాయర్ ను హెడ్ కోచ్ గా నియామకం చేసేందుకు ప్లాన్ చేసింది. అలాగే ఢిల్లీకి చెందిన కేఎల్ రాహుల్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
అతనితో పాటు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పై కూడా కన్ను వేసింది కేకేఆర్. తమ జట్టులో ఉన్న కీలక ప్లేయర్ ను ముంబైకి ఇచ్చేసి, ట్రేడింగ్ ద్వారా రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ముంబై తరఫున 16.30 కోట్లు తీసుకుంటున్న రోహిత్ శర్మకు.. 16.50 కోట్లు ఆఫర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే మరో రెండు కోట్లు ఎక్కువ ఇచ్చైనా, అతన్ని కొనుగోలు చేయాలని ఈ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రోహిత్ శర్మ జట్టులోకి వస్తే, అతనికి కెప్టెన్సీ కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..