
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపటినుండి టి20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ పూర్తయింది. ఇందులో చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరీస్ సమం అయింది. అయితే రేపటి నుంచి ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏకంగా మూడు టీ20లు జరగనున్నాయి. మధ్య
ఇక రేపు అంటే అక్టోబర్ 28వ తేదీన రావల్పిండి వేదికగా మొదటి టీ20 జరగనుంది. రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ టి20 నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త జెర్సీలో కనిపించనుంది. ఇన్ని రోజులు గ్రీన్ జెర్సీలో కనిపించిన పాకిస్తాన్, రేపు మొదటి టీ20 లో మాత్రం పింక్ జెర్సీలో మెరువనుంది. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన, బాధితులకు సహాయం చేసేందుకుగాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రేపు పింక్ జెర్సీలో పాకిస్తాన్ టీం కనిపించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..