.విజయనగరం.లో.పైడితల్లి ఉత్సవాలు ఘనంగా
అమరావతి, 6 అక్టోబర్ (హి.స.) విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె, ఎమ్మెల
.విజయనగరం.లో.పైడితల్లి  ఉత్సవాలు ఘనంగా


అమరావతి, 6 అక్టోబర్ (హి.స.)

విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు అశోక్‌ గజపతిరాజుకు స్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ఈవో శిరీష, ఉత్సవాల ప్రత్యేకాధికారి మూర్తి ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande