తిరుపతి, 8 అక్టోబర్ (హి.స.)తిరుపతి(Tirupati)లో ఇటీవల చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలకు పాల్పడేది కర్ణాటక గ్యాంగ్(Karnataka Gang) అని పోలీసులు గుర్తించారు. వీరు నగరాన్ని షెల్టర్ జోన్‌గా చేసుకుని చైన్ స్నాచింగ్‌ల నుంచి ద్విచక్ర వాహనాలు చోరీ చేయడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధుల బ్యాగులు ఎత్తుకెళ్లి ఆభరణాలు, నగదు కొట్టేస్తున్నారని తెలిసింది. వీరు ఆరు నెలలకు ఒకసారి తాము ఎంచుకున్న ప్రాంతాలకు వెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
ఈ ముఠాల కోసం జిల్లా పోలీసులు ఆరేడు నెలలుగా గాలిస్తున్నారు. తిరుపతిలో కర్ణాటకకు చెందిన దాదాపు 10 గ్యాంగుల సభ్యులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల తిరుపతిలో క్రితం తిరుపతిలోని పోస్టల్ కాలనీలో ఒకరు.. అలిపిరి పరిధిలోని నలుగురు మహిళల మెడల నుంచి దాదాపు 186 గ్రాముల బంగారు చైన్లు లాక్కొని పరారయ్యారు. ఈ పనికి పాల్పడింది కర్ణాటక ముఠానే అని తాజాగా భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి రూరల్ పరిధిలోని చిగురవాడలో ఇద్దరు మహిళల మెడల నుంచి చైన్లు లాక్కెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV