పోలీస్ డిపార్ట్మెంట్లో విషాదం..గుండెపోటుతో ACP మృతి
హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.) పుష్ప-2 తొక్కిసలాట ఘటనపై ఏకంగా హీరో అల్లు అర్జున్ పై సోమాజిగూడ ప్రెసైక్లబ్లో ప్రెస్మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన ACP సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. సుదీర్ఘ కాలం పాటు డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో ఆయన క
ఏసీపీ మృతి


హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)

పుష్ప-2 తొక్కిసలాట ఘటనపై ఏకంగా హీరో అల్లు అర్జున్ పై సోమాజిగూడ ప్రెసైక్లబ్లో ప్రెస్మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన ACP సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. సుదీర్ఘ కాలం పాటు డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో ఆయన కొనసాగారు. తలపై మూడు సింహాలే దైవం నమ్మి నిరంతరం ప్రజా సేవ, ప్రజల భద్రత కోసం నిత్యం కృషి చేసిన వ్యక్తి విష్ణుమూర్తి అని సహచరులు కొనియాడారు. కాగా, హైదరాబాద్ లోని తన నివాసంలో ఆదివారం రాత్రి విష్ణుమూర్తి హార్ట్ అటాక్తో తుది శ్వాస విడిచారు. పోలీసు శాఖలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande