తిరుపతి.ఈశ్వీన్ వ్యవసాయ వర్సిటీకి బాంబు.బెదిరింపు
అమరావతి, 6 అక్టోబర్ (హి.స.) తిరుపతి: నగరంలో మరోసారి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ వ్యవసాయ వర్సిటీకి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. వర్సిటీ దగ్గర సీఎం చంద్రబాబు పర్యటన కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ దగ్గర ఐఈడ
తిరుపతి.ఈశ్వీన్ వ్యవసాయ వర్సిటీకి బాంబు.బెదిరింపు


అమరావతి, 6 అక్టోబర్ (హి.స.)

తిరుపతి: నగరంలో మరోసారి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ వ్యవసాయ వర్సిటీకి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. వర్సిటీ దగ్గర సీఎం చంద్రబాబు పర్యటన కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ దగ్గర ఐఈడీ బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు హెలిప్యాడ్ పరిసరాల్లో బాంబు స్క్వాడ్, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande