ఖండించడానికి మాటలు సరిపోవు.. దేశ చరిత్రలో చీకటి రోజు.. సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.) సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దాడికి యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న ఓ లాయర్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గావయ్ పై దాడి చేసేందుకు యత్నించాడు. తన
సీఎం రేవంత్


హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)

సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దాడికి యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న ఓ లాయర్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గావయ్ పై దాడి చేసేందుకు యత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు చూడగా.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై అడ్డుకున్నారు.

దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న బీఆర్ గవాయ్పై జరిగిన దాడి దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఘటనను పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఖండించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. 'మా దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న గౌరవనీయులపై దాడి చేసి భయపెట్టే ఈ నీచమైన ప్రయత్నాన్ని ఖండించడానికి మాటలు సరిపోవు. ఇది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఇలాంటి పిరికిపంద దాడులతో తాను వెనక్కి తగ్గబోనని ధైర్యంగా ప్రకటించిన మన అజేయమైన భారత ప్రధాన న్యాయమూర్తి బీ. ఆర్. గవాయై నేను, ఈ దేశ పౌరులందరూ మద్దతుగా ఉన్నాము' అని భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande