చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల హల్ చల్
హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.) దసరా సెలవుల నేపథ్యంలో చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇది వరకే ఖజానా జ్యువెలర్స్తో పాటు.. పలు దేవాలయాల్లో చోరీ ఘటనలు మరవక ముందే ఈసారి ఏకంగా ఓ పోలీసు హెడ్ కాన
దొంగల హల్ చల్


హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)

దసరా సెలవుల నేపథ్యంలో

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇది వరకే ఖజానా జ్యువెలర్స్తో పాటు.. పలు దేవాలయాల్లో చోరీ ఘటనలు మరవక ముందే ఈసారి ఏకంగా ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే చోరీకి తెగబడ్డారు. తాజాగా రెండు తాళం వేసిన ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. ఓల్డ్ ఎంఐజిలోని సీతారామ్మూర్తి అనే రిటైర్డ్ బిహెచ్ఎల్ ఉద్యోగి ఇంట్లో 18 తులాల బంగారం, 60 తులాల వెండి కొంత నగదు అపహరించారు. గత నెల 29 సత్యసాయిబాబా ట్రస్ట్ దర్శనానికి వెళ్లిన రామ్మూర్తి కుటుంబ సభ్యులు ఆదివారం తిరిగి వచ్చి చూసే సరికి తమ ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు.

అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్కు చెందిన రైల్వే విహార్లోని ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. 5 తులాల బంగారం, రూ.40,000 నగదు ఎత్తుకెళ్లినట్లు హెడ్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande