నకీలీ దగ్గు సిరప్ ఘటనలో 16 కు చేరిన మృతుల సంఖ్య.. విచారణకు సిట్ ఏర్పాటు
మధ్యప్రదేశ్, 6 అక్టోబర్ (హి.స.) మధ్యప్రదేశ్లో చింద్వారాలో నకిలీ విషపూరిత దగ్గు సిరప్ ఘటనలో మృతుల సంఖ్య 16 కు చేరింది. నిన్న సాయంత్రం వరకు 14 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. సోమవారం ఉదయం మరో ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపా
దగ్గు మందు


మధ్యప్రదేశ్, 6 అక్టోబర్ (హి.స.) మధ్యప్రదేశ్లో చింద్వారాలో నకిలీ విషపూరిత దగ్గు సిరప్ ఘటనలో మృతుల సంఖ్య 16 కు చేరింది. నిన్న సాయంత్రం వరకు 14 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. సోమవారం ఉదయం మరో ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. అలాగే మరికొంతమంది పిల్లలు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం మారిన ఈ కేసును మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు 16 మంది పిల్లల మృతిపై విచారణ చేపట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పటి వరకు ఈ కేసుపై పోలీసులు చేసిన దర్యాప్తు వివరాలను సిట్ కి అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా పిల్లల మరణాలకు సంబంధించి నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై చింద్వారాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోని అరెస్టు చేయగా, కోల్డఫ్ దగ్గు సిరప్ తయారీ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande