హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ సీపీ
బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ డిపార్ట్మెంట్లో తనదైన మార్ను చూపిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి ఎవరైనా డ్రంక్ డ్రైవ్ చేస్తూ దొరికితే వారి తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. తప్పతాగి వాహనాలు నడుపితే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్పై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు కారణమై మీ జీవితానికి మీరే వెలకట్టలేని జరిమానాను విధించుకోవద్దని అన్నారు. డ్రంకెన్ డ్రైవ్ మీతో పాటు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతుందని హితవు పిలారు. థింక్ బిఫోర్ యూ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ కామెంట్ చేశారు. గుర్తుపెట్టుకోండి.. మద్యం తాగి వాహనం నడిపితే మూల్యం తప్పదు! బాధ్యత గల పౌరులుగా మద్యం తాగి వాహనం నడపకండి అంటూ సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు