హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు
కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర చట్టసభల్లో ఆమోదం పొందాయని తెలిపారు. కానీ, కావాలనే కొందరు బీసీ రిజర్వేషన్ల అమలుకు సర్కార్ విడుదల చేసిన జీవోపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన కేసును డిస్మిస్ చేసినందుకు తాము సంతోషిస్తున్నామని కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..