హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్ద మంగళారం గ్రామ శివారులోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో కొంత మంది యువతీ యువకులు పార్టీ చేసుకుంటున్నారని పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నగరానికి చెందిన వివిధ ప్రాంతాల 50 మంది యువతీ యువకులు పట్టుబడ్డారు. ఇందులో 12 మంది అమ్మాయిలు 38 మంది యువకులు ఉన్నారు. వీరిలో చాలామంది మైనర్లే ఉన్నారు. వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరు మైనర్, ఒకరు మేజర్ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారించారు.
6 విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధిక డబ్బు ఈజీ మనీకి అలవాటుపడ్డ ఫామ్ హౌస్ ఓనర్ ఈ వ్యవహారం అంతా ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా ట్రాప్ హౌస్ ఖాతా నిర్వహిస్తూ.. యువతను ఆకర్షించి ఈ పార్టీకి తెర తీశారు. ఇంస్టాగ్రామ్ లో ఈవెంట్ పేరిట ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి 1600, జంటగా వస్తే రూ 2800 మద్యంతో పాటు గంజాయి డ్రగ్స్ అని యువతకు ఎరవేశాడు. పట్టుపడ్డ 50 మంది యువతీ యువకులను పోలీసుల అదుపులో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు