తెలంగాణ, సంగారెడ్డి. 6 అక్టోబర్ (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆందోల్లో హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నిక ల్లో ఓట్లు అడగటానికి వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. కనీసం యూరియా కూడా సరిగా సరఫరా చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు