హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దసరా పండగ, వీకెండ్ ముగించుకుని నగర వాసులు తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. దీంతో సిటీ ఔట్స్ కట్స్ లో సోమవారం పొద్దుపొద్దున్నే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఇవాళ ఉదయం ఆఫీస్లకు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు మెట్రోకు (Metro Rush) పోటెత్తారు. దీంతో మెట్రో రైళ్లన్ని కిక్కిరిసిపోయాయి. ఉదయం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కు ప్రయాణికులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. రద్దీ పెరగడం అందుకు తగిన ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రయాణికులు మెట్రో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్కలేటర్లు పని చేయడం లేదని, ప్లాట్ ఫారంకు చేరేందుకు గంటల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..