తెలంగాణ, 6 అక్టోబర్ (హి.స.)
రాష్ట్ర రాజకీయాల్లో మరో ఎన్నిక నగారా మోగింది. జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించారు. బిహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపారు. అక్టోబరు 13 నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ.. నవంబర్11న ఎన్నిక.. నవంబర్ 14న కౌంటింగ్ ఉండనుందని పేర్కొన్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఇవాళి నుంచే హైదరాబాద్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు