హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలలో
అత్యంత వివాదాస్పద నేతల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మొదటి స్థానంలో ఉంటారు. హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఆయన పలు సందర్భాల్లో ఇతర మతస్తులపై చేసే వ్యాఖ్యల కారణంగా పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా బీజేపీ నుంచి బహిష్కరించబడ్డారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటున్నప్పటికి తాజాగా రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వగా ఆయనపై తెలంగాణలో కేసు నమోదు అయింది.
వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యల కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ వర్గానికి చెందిన ఫతే దర్వాజ యువకులు ఎమ్మెల్యే రాజా సింగ్ పై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శాలిబండ పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..