హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల్లో తెలంగాణ ఓబీసీ కోటాను 42%కి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే తర్వాత, తాము క్యాబినెట్ ప్రవేశపెట్టాము. ఆపై బీసీ బిల్లును రూపొందించి.. దానిని దానిని చట్టంగా రూపొందించి గవర్నర్కు పంపాము. గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. ఆమోదం పొంది, దానిని సభలో
రాష్ట్రపతి వద్దకు బీసీ బిల్లు వెళ్లి.. నాలుగైదు నెలలు అయింది. మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కుల సర్వే నిర్వహించాము. అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా దీనిని ఆమోదించాయి. దీనిని ఆపాలని కొంతమంది వ్యక్తులు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో విచారణ జరిగింది. 8వ తేదీకి వాయిదా పడింది. కేసు అక్కడే ఉండగా, కొందరు సుప్రీంకోర్టు తలుపులు తట్టి బీసీ బిల్లుకు వ్యతిరేకంగా పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు