మహబూబ్నగర్, 6 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మార్గం సుగమం అయినట్లేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సరికాదు అంటూ కొంతమంది కేసు వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ కేసును డిస్మిస్ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేశారు. అటువంటి వారికి సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టు లాంటిది అని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. హైకోర్టులోను తీర్పు అనుకూలంగా వస్తుంది అన్న ఆశాభావాన్ని మంత్రి శ్రీహరి వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు